ఏపీ 10వ తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ – SSC Short Memos విడుదల

By: KS SHANKAR

On: May 26, 2026

Follow Us:

Post Published on:

May 26, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన SSC Public Examinations March 2026 కు సంబంధించిన Memorandum of Marks (Short Memos) ను అధికారికంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం (Directorate of Government Examinations – DGE) తాజా ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించింది.

విద్యార్థుల Short Memos ను స్కూల్ లాగిన్స్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అన్ని పాఠశాలల Head Masters వెంటనే వాటిని డౌన్‌లోడ్ చేసి, స్కూల్ సంతకం మరియు ముద్రతో విద్యార్థులకు అందించాలని సూచించారు.

ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?

SSC Short Memos అధికారిక వెబ్‌సైట్ అయిన https://bse.ap.gov.in/ లో స్కూల్ లాగిన్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

Head Masters కు ముఖ్య సూచనలు :

ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన ప్రకటన ప్రకారం:

AP TET 2026 Notification విడుదల – పూర్తి వివరాలు
  • విద్యార్థుల Short Memos ను వెంటనే డౌన్‌లోడ్ చేయాలి
  • స్కూల్ సీల్ మరియు సంతకంతో విద్యార్థులకు ఇవ్వాలి
  • విద్యార్థుల వివరాలు జాగ్రత్తగా పరిశీలించాలి
  • ముఖ్యంగా:
    • పేరు
    • ఇంటి పేరు (Surname)
    • పుట్టిన తేదీ (Date of Birth) వంటి వివరాలను తల్లిదండ్రులతో కలిసి ధృవీకరించాలి

Edit Option ఎప్పుడు ఉంటుంది? :

విద్యార్థుల వివరాలలో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు Edit Option ను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. Edit Option తేదీలు: 29-05-2026 నుండి 04-06-2026 వరకు చేయవచ్చు. ఈ సమయంలో స్కూల్ లాగిన్ ద్వారా అవసరమైన సవరణలు చేయవచ్చు.

విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సూచన

విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతరులు కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలని DGE సూచించింది. సోషల్ మీడియా లేదా అనధికారిక వెబ్‌సైట్లలో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది.

ముఖ్యమైన విషయం :

SMC Guidelines 2026: తల్లిదండ్రులకు భారీ అధికారాలు | ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మార్పులు

Short Memo అనేది విద్యార్థుల మార్కుల తాత్కాలిక మెమో. భవిష్యత్తులో వచ్చే Original SSC Certificate కోసం ఈ వివరాలు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు.

Official Source: https://bse.ap.gov.in/ or
https://www.bse.ap.gov.in/sscadmttsix/Account/Login.aspx

AP SSC 10th Class Marks Memos 2026 Download చేసే విధానం

AP SSC 10వ తరగతి Short Marks Memo ను స్కూల్ లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి:
  2. హోమ్ పేజీలో
    “SSC Public Examinations 2026 – School Wise Results and Memorandum”
    అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. తర్వాత School Login Page ఓపెన్ అవుతుంది.
  4. అక్కడ:
    • User ID గా School SSC Code నమోదు చేయండి
    • Password నమోదు చేయండి
  5. తరువాత Confirm School UDISE Code పై క్లిక్ చేయండి.
  6. ఇప్పుడు March – 2026 SCHOOL WISE RESULT అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  7. తర్వాత విద్యార్థి యొక్క Roll Number పై క్లిక్ చేయండి.
  8. ఇప్పుడు SSC Short Marks Memo ఓపెన్ అవుతుంది.
  9. చివరగా:
    • Print బటన్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు
    • లేదా PDF రూపంలో మీ కంప్యూటర్ / మొబైల్‌లో Save చేసుకోవచ్చు

K S SHANKAR

Author of Amaravati Teachers Academy

ATA Andhra Pradesh.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment