అసాధారణ సెలవు (EOL) సంపాదిత సెలవు (EL) మధ్య వ్యత్యాసం
*మౌలిక నిబంధనలోని 85(A) ప్రకారం ఏ ఇతర అనుమతించదగిన సెలవు ప్రభుత్యోద్యోగి ఖాతాలో జమగా లేని సందర్భాలలో వ్రాతపూర్వకంగా దరఖాస్తు ద్వారా ప్రత్యేక పరిస్థితులలో మంజూరు చేయు సెలవును అసాధారణ సెలవు అంటారు. ఈ సెలవుకు జీతభత్యాలు అనుమతించరు
*అసాధారణ సెలవు వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వాడుకుంటే 3 సంవత్సరాల వరకు పెన్షన్ కు అనుమతిస్తారు. ఆ పైన సెలవును నాన్-క్వాలిఫయింగ్ సెలవుగా పరిగణిస్తారు.*
*ఈ సెలవు కాలంలో సమాన రోజులు వార్షిక ఇంక్రిమెంటు ముందుకు జరుగును. అదే అసాధారణ సెలవు వైద్య ధృవపత్రం పై వాడుకుంటే పెన్షన్ కు కలుస్తుంది. 6 నెలలకు మించిన సెలవును ఇంక్రిమెంటు మంజూరుకు అనుమతిస్తారు అయితే C&DSE గారి అనుమతి పొందాలి. 6 నెలలకు మించిన కాలమునకు ప్రభుత్వ అనుమతి పొందాలి.
*సస్పెన్షన్ పీరియడు కు అసాధారణ సెలవు మంజూరు అయిన సందర్భంలో మాత్రం ఆ EOL పీరియడ్ ను ఇంక్రిమెంట్లకు, పెన్షన్ లెక్కించాల్సిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం Sub-Rule (5) of FR-54 మరియు Sb-Rule (7) of FR-54 ను సవరిస్తూ… GO Ms No 307 Fin (FR 2) Dept. dated 03.12.2012 జారీ చేసింది.
*5 సంవత్సరాల సర్వీసు గల ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అనుమతితో విదేశాలలో ఉద్యోగం చేయుటకు 5 సంవత్సరాల వేతనం లేని సెలవు వాడుకొనవచ్చును. ఈ కాలము 2,3 లేదాఅంతకన్నా ఎక్కువ దఫాలుగా వాడుకొనవచ్చును.
*G.O.Ms.No.214 F&P తేది: 3.9.1996*
——————————————————————————————————————————–
సంపాదిత సెలవు (EL):
*సంపాదిత సెలవు గురించి APLR Rules-1933 లోని రూల్- 8,9,10,11,12,17 మరియు 20 లలో వివరించడం జరిగింది.*
*సంపాదిత సెలవు డ్యూటీలోనూ మరియు లీవ్ కాలంలోనూ జమచేయవచ్చు.*
*పర్మనెంట్ ఉద్యోగులకు సంవత్సరానికి 30 రోజులు, *G.O.Ms.No.317 తేది: 15.9.1994* ప్రకారం ఉపాధ్యాయులకు సంవత్సరానికి 6 చొప్పున మంజూరుచేస్తారు.*
*ప్రతి అర్ధ సంవత్సరమునకు జనవరి 1న,జులై 1న 3 రోజుల చొప్పున EL ఖాతాకు జమచేయబడును.*
*CLs,HPLs ఖాతాలో నిల్వలేని సందర్భాలలో ఉద్యోగ/ఉపాధ్యాయుల కు ఒక్కరోజు కూడా EL మంజూరుచేసే అధికారం సంబంధిత DDO లకు కలదు.*
*ఈ సెలవు గరిష్ట నిలువ పరిమితి 300 రోజులు మాత్రమే* G.O.Ms.No.232 తేది: 16.9.2005
*ఇట్టి సంపాదిత సెలవును ఒకేసారి 180 రోజుల వరకు వాడుకొనవచ్చును.* *G.O.Ms.No.153 తేది: 4.5.2010
*సందేహం:*
*సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తే ఆ కాలాన్ని ఇంక్రిమెంట్లు,పెన్షన్ కు లెక్కిస్తారా?*
*సమాధానం:*
*వివిధ కారణాలతో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీస్ నుంచి సస్పెన్షన్ కు గురవుతారు. కొన్ని నెలలపాటు సస్పెన్షన్ ఉన్న తర్వాత Competent Authority …. సస్పెన్షన్ ఎత్తివేసి… వారిని తిరిగి రీఇన్స్టెట్ చేస్తారు. చాలా కేసుల్లో సస్పెన్షన్ పీరియడ్ కు ఎలిజిబుల్ లీవ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలూ జారీచేస్తారు. ఇలాంటి సందర్భాల్లో సదరు ఉద్యోగికి సస్పెన్షన్ కాలానికి సరిపోయే సెలవులు…. Half Pay Leave మరియు Earned Leave నిల్వ లేనప్పుడు… అనివార్యంగా జీతనష్టపు అసాధారణ సెలవు (Extraordinary Leave on Loss of Pay) మంజూరు చేయాల్సి ఉంటుంది. మామూలుగానైతే, జీతనష్టపు అసాధారణ సెలవు మంజూరు ఎన్ని రోజులు ఉంటుందో…. అన్ని రోజులు వార్షిక ఇంక్రిమెంటును కూడా పోస్టుపోన్ చేస్తారు. కానీ, సస్పెన్షన్ పీరియడ్ కు అసాధారణ సెలవు మంజూరు అయిన సందర్భంలో మాత్రం ఆ EOL పీరియడ్ ను ఇంక్రిమెంట్లకు, పెన్షన్ లెక్కించాల్సిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం *Sub-Rule (5) of FR-54 మరియు Sb-Rule (7) of FR-54 ను సవరిస్తూ… GO Ms No 307 Fin (FR.2) Department dated 03.12.2012* *నెంబర్ జీవో జారీచేసింది.