---Advertisement---

Update Your Aadhar Before June 14 2025 | Aadhar Upadate with Free of Cost

By: KS SHANKAR

On: May 28, 2025

Follow Us:

---Advertisement---

Post Published on:

May 28, 2025

🔊 జూన్ 14 తర్వాత ఆధార్ ఉచిత అప్‌డేట్ సర్వీస్ ఇక ఉండదు. చేంజెస్ చేసుకోవాలంటే ఫీజు తప్పనిసరి అవుతుంది. కాబట్టి మార్పులు అవసరమైతే ఇప్పుడే చేసుకోండి!

🍥 ఆధార్ కార్డ్ యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏదైనా అప్లై చేయాలన్నా, ప్రయాణించాలన్నా – నువ్వు ఎవరో చెప్పడానికి ఆధార్ తప్పనిసరి. ఓటర్ ఐడీ, పాన్ కార్డు ఉన్నా, అన్ని గుర్తింపులకు ఆధార్ ఒక కీలక ఆధారం. కానీ, ఆధార్ తీసుకునే సమయంలో కొంతమందికి తప్పులు జరిగినా పట్టించుకోరాదు. కానీ, అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్ వంటి సందర్భాల్లో ఈ తప్పులు పెద్ద సమస్యలకే దారి తీస్తాయి.

🌀 అందుకే ఇప్పటివరకు UIDAI ఆధార్ అప్‌డేట్స్‌కి ఉచిత సౌకర్యం అందిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఉచిత సేవలు June 14, 2025 తో ముగుస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

💠 2025 జూన్ 14 తర్వాత ఆధార్‌లో ఏదైనా మార్పు చేసుకోవాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువు తర్వాత మార్చాలంటే ఫీజుతో సహా ఆధార్ సెంటర్‌కి వెళ్లి అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

New Income Tax Rules 2025: Important Stuff for E-filing

🥏 జూన్ 14 వరకు myAadhaar పోర్టల్‌ ద్వారా లేదా ఆధార్ సెంటర్‌కి వెళ్లి ఫ్రీగా పేరు, జన్మతేది, అడ్రెస్, లింగం, భాష వంటి వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ సేవలు లభిస్తాయి.

💥 జూన్ 14 లోపు ఇలా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి:

💫 ప్రస్తుతం ఉచిత సేవలు అందుబాటులో ఉన్నందున https://myaadhaar.uidai.gov.in పోర్టల్‌కి లాగిన్ అయి మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, మొబైల్‌కి వచ్చిన OTPతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అడ్రెస్ ప్రూఫ్, ఐడెంటిటీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి, ‘Document Update’ సెక్షన్‌లో అవసరమైన ఫైల్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ చేసిన తర్వాత SRN నంబర్ వస్తుంది, దాని ద్వారా స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.

💥 సింపుల్ స్టెప్స్:

Check Thalliki Vandanam Payment Status 2025

➡️ https://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి → ఆధార్ నంబర్ & క్యాప్చా ఎంటర్ చేయాలి → OTP ఎంటర్ చేయాలి → Document Update ఆప్షన్ ఎంచుకోవాలి → అవసరమైన మార్పులు చేయాలి → ఆధారంగా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.

➡️ ఇప్పటివరకు ఆధార్‌లో తప్పులు సరిచేసుకోవడానికి ఉచిత సేవలు అందించారు, ఎందుకంటే ఆధార్ డేటా ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ సేవలు చార్జ్ చేయబడతాయి. కాబట్టి గడువు ముగిసేలోపు ఏవైనా మార్పులు ఉంటే వెంటనే చేసుకోవడం మంచిది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Update Your Aadhar Before June 14 2025 | Aadhar Upadate with Free of Cost”

Leave a Comment