KVS & NVS Recruitment 2025: 14,967 Teaching and Non-Teaching Posts – Apply Online

By: KS SHANKAR

On: November 17, 2025

Follow Us:

Post Published on:

November 17, 2025

KVS

దేశవ్యాప్తంగా టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ సంవత్సరం గొప్ప అవకాశమొచ్చింది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలైన కేంద్రీయ విద్యాలయాలు (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS)లలో వేల సంఖ్యలో ఖాళీలు ప్రకటించడంతో వేలాది మంది అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

🔰 మొత్తం ఖాళీల సంఖ్య – 14,967 పోస్టులు

తాజాగా విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం KVS మరియు NVS కలిసి మొత్తం 14,967 పోస్టులు ప్రకటించాయి.

KVS పోస్టులు – 9,126

  • టీచింగ్ & నాన్-టీచింగ్ కలిపి
    (నోటిఫికేషన్ ప్రకారం)

NVS పోస్టులు – 5,841

  • PGT, TGT, నాన్-టీచింగ్ మొదలైన డిపార్ట్‌మెంట్లలో

🗓️ దరఖాస్తు తేదీలు

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 14 నవంబర్ 2025
  • చివరి తేది: 4 డిసెంబర్ 2025

ఈ సమయంలో తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్లలో అప్లికేషన్ పూర్తి చేయాలి.

LEAP App లో Donor Module అందుబాటు – MEGA PTM 3.0
1000262439 1

🎓 అర్హతలు

పోస్టుల ప్రకారం అవసరమైన అర్హతలు వేరువేరు ఉంటాయి:

  • డిగ్రీ / పీజీ
  • B.Ed / D.Ed
  • CTET (కొన్ని పోస్టులకు తప్పనిసరి)
  • ఇంటర్ / డిప్లొమా
  • B.L.Sc
  • టెక్నికల్ పోస్టుల కోసం ప్రత్యేక కోర్సులు

ప్రతి పోస్టుకు పూర్తి అర్హత వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇవ్వబడతాయి.

🌍 పోస్టింగ్ లొకేషన్

ఈ నియామకాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఉండే అవకాశముంది.
మరియు “ఎర్లీ ట్రాన్స్‌ఫర్” అవకాశం ఉండకపోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

✅ INDIAN CONSTITUTION – TOP 100 IMPORTANT Q/A

📝 ఎంపిక విధానం

ఆయా పోస్ట్ కి అనుగుణంగా ఎంపిక దశల్లో ఇవి ఉండవచ్చు:

  • CBT/Written Test
  • Interview
  • Skill Test (కొన్ని నాన్-టీచింగ్ పోస్టులకు)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

📌 దరఖాస్తు ఎలా చేయాలి?

  1. క్రింది అధికారిక వెబ్‌సైట్లలో ఏదో ఒకదాని ద్వారా నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయండి
  2. మీ అర్హతలు పరిశీలించండి
  3. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి
  4. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి
  5. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచండి

🌐 అధికారిక వెబ్‌సైట్లు:

ఈసారి పోస్టులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అర్హులైన ప్రతి అభ్యర్థి తప్పక అప్లై చేయాలి.

K S SHANKAR

Author of Amaravati Teachers Academy

ATA Andhra Pradesh.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment