---Advertisement---

Income Tax Softwares for AP Government Employees

By: KS SHANKAR

On: June 2, 2025

Follow Us:

---Advertisement---

Post Published on:

June 1, 2025

పరిచయం

Income Tax – ఆదాయ పన్ను అనేది మనం సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వం విధించే పన్ను. ఇది దేశ అభివృద్ధికి, ప్రజలకు సేవలు అందించడానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన మూలం. ఈ వ్యాసంలో ఆదాయ పన్ను గురించి పూర్తి వివరాలు తెలుగులో సులభంగా మీకు అందిస్తున్నాం.

Income Tax

Income Tax – ఆదాయ పన్ను అంటే ఏమిటి?

ఆదాయ పన్ను అంటే మీరు ఉద్యోగం, వ్యాపారం, ఇంటి అద్దె, మూలధన లాభాలు వంటి వాటి నుండి పొందే ఆదాయంపై చెల్లించే పన్ను. ఈ పన్ను భారత ప్రభుత్వ ఆదాయ పన్ను విభాగం ద్వారా వసూలు చేయబడుతుంది.

New Income Tax Rules 2025: Important Stuff for E-filing

ఆదాయ పన్ను ఫారమ్‌లు (ITR Forms)

ప్రతి వ్యక్తి తన ఆదాయాన్ని బట్టి తగిన ITR forms ను ఎంచుకోవాలి:

ఫారమ్వివరాలు
ITR-1 (Sahaj)వేతన(Salary), పెన్షన్(Pension), ఒక ఇల్లు (Rent form House) నుండి ఆదాయం ఉన్న వారు
ITR-2ఇతర వనరుల నుండి ఆదాయం ఉన్న వారు, వివిధ ఆస్తులు కలిగిన వారు File to filled for Income form Other sources.
ITR-3వ్యాపారం(Business) లేదా వృత్తి (Working Professionals) నిర్వహించేవారు.
ITR-4 (Sugam)చిన్న వ్యాపారాలు, స్వీయ ఉపాధి కలిగిన వారు (Presumptive income)
ITR-5పార్ట్‌నర్‌షిప్ Forms, AOPలు
ITR-6కంపెనీలు(Companies)
ITR-7ట్రస్ట్‌లు(Trusts), దాతృత్వ సంస్థలు(Organizations)

ఆదాయ పన్ను ఎలా ఫైల్ చేయాలి?

  1. incometax.gov.in వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
  2. PAN ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  3. మీకు సరిపోయే ITR ఫారమ్ ఎంచుకోండి.
  4. మీ ఆదాయ వివరాలు నింపండి.
  5. రిటర్న్ సమర్పించండి.
  6. e-Verification చేయండి (ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ ద్వారా).

Excel ఆధారిత ఉపయోగితలతో ఫైలింగ్:

భారత ఆదాయ పన్ను విభాగం ITR Excel ఉపయోగితలను అందిస్తుంది. వీటిని డౌన్‌లోడ్ చేసి, వివరాలు నింపి XML ఫైల్‌గా సేవ్ చేసి, పోర్టల్‌లో అప్లోడ్ చేయవచ్చు. వీటితో పాటు ఆదాయపు పన్ను లెక్కింపు కోసం Manual Excel Softwares ఉపయోగించవచ్చు.

How to get PAN Card 2.O ?| Income Tax Department

ఆదాయ పన్ను చట్టంలోని ముఖ్య విభాగాలు:

  • Section 2(24): ఆదాయం నిర్వచనం.
  • Section 10: మినహాయింపులు (ఉదా: వ్యవసాయ ఆదాయం).
  • Section 80C: ట్యాక్స్ మినహాయింపు (LIC, PPF మొదలైనవి.)
  • Section 192: వేతనాలపై TDS.
  • Section 139: రిటర్న్ సమర్పణ. E-filing

ఆదాయ పన్ను చెల్లించాల్సిన తేది:

సాధారణంగా ఉద్యోగులు ప్రతీ ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ 01 నుండి మార్చి 31 వరకు గల ఆదాయ పన్ను లెక్కించి తమ డ్రాయింగ్ అధికారికి అందచేస్తారు DDO ఈ వివరాలను TDS రూపంలో INCOME TAX DEPARTMENT వారికి తెలియచేస్తారు. అనంతరం ఉద్యోగి వాటిని ధ్రువీకరణ చేస్తూ ప్రతీ సంవత్సరం జూలై 31వ తేది వరకు ఆదాయ పన్ను రిటర్న్ సమర్పించాలి. కానీ కొన్ని సందర్భాలలో తేదీ పొడిగించబడుతుంది.


ముఖ్యమైన అంశాలు:

  • TDS: ఆదాయ వనరులను లెక్కించి పన్ను కట్టడం
  • ఆడ్వాన్స్ ట్యాక్స్: అధిక ఆదాయం ఉంటే ముందే పన్ను చెల్లించడం
  • పన్ను మినహాయింపులు: LIC, NPS, హోమ్ లోన్ వడ్డీ, ఇతర సేవింగ్స్ మొదలైన వాటిపై మినహాయింపులు పొందవచ్చు.

ప్రభుత్వ (లేదా) ప్రైవేటు ఉద్యోగులకు (Salary from Income) అవసరం అయ్యే కొన్ని ముఖ్యమైన Income Tax Calculation Softwares ను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాము.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment