---Advertisement---

Andhra Pradesh Govt Life Insurance Scheme-Information

By: KS SHANKAR

On: May 4, 2025

Follow Us:

---Advertisement---

Post Published on:

September 3, 2025

ఈ పథకం 1.11.1956 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు అమలతో ఉన్నది.1.11.1998 తరువాత పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు కూడా వర్తింప చేశారు. (GO.MS.No-212 Fin. Date:17.12.1997)

అర్హతలు: 21-53 సం.ల మధ్య వయసు, ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన పెన్షన్ కు అర్హమైన పోస్టులో పనిచేస్తున్న తాత్కాలిక,శాశ్వత ఉద్యోగులందరు విధిగా ఈ స్కీం లోకి చేరాలి. 53 సం. పూర్వమే ప్రీమియం చెల్లించి 53 సం.లు దాటినా తరువాత ప్రతిపాదనలు పంపితే అటువంటి అభ్యర్థుల పాలసీలు ఆమోదించుటకు డైరెక్టర్ వారికి అధికారం కలదు. విజయవాడ,విశాఖ, కార్పొరేషన్ తప్పించి అన్ని మున్సిపాలిటీలకు APGLI విస్తరించబడినది(GO.MS.No-25, Date:3.3.2011).
Go.RT.1604 fin. Date.5.12.1978 మేరకు పాలసీ హోల్డర్ ఆఫడవిట్ మేరకు మిస్సింగ్ క్రెడిట్ ను డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సరిచేయాలి. కొత్తగా స్కీం లో చేరిన ఉపాధ్యాయులకు సంభందించి ఆ షెడ్యూల్ లో న్యూ కేస్ అని పేర్కొనాలి. నిర్ణిత దరఖాస్తు ఫారాలను పాలసీదారుడు యాజమాన్యం ద్వారా పంపుకొన్న పిదప పరిశీలించి పాలసీ నంబర్ కేటాయించాలి.పాలసీ బాండ్ ను సంబంధిత యాజమాన్యం ద్వారా ఆయా ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కార్యాలయం వారు అందచేయుదురు.మొదటి నెల ప్రీమియం కట్టగానే దరఖాస్తు ఫారాలు పంపుకోవాలి. నెంబర్ కేటాయించబడని వారికి రిస్క్ కవర్ కాదు.

వేతనం పెరిగినప్పుడు:
పాలసీదారుని జీతభత్యాలలో ఇంక్రిమెంట్,ప్రమోషన్,తదితర కారణాల వల్ల పెరుగుదల జరిగినపుడు ప్రీమియం కూడా ఆయా స్లాబుల ప్రకారం మినహాయించాలి.పెరిగిన ప్రీమియం రెండింటిని షెడ్యూల్ లలో ఉదహరించి రేమార్కులు నమోదు చేసి నిర్దేశించిన ప్రపోజల్ ఫారంతో కలిపి ఇన్సూరెన్స్ అధికారులకు సమర్పించాలి.పాలసీ నెంబర్ ,చెల్లిస్తున్న ప్రీమియం సర్వీస్ రిజిస్టర్ లో రాయాలి.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరు నాటికి నిర్ణిత అకౌంట్ స్లిప్ లో ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ నిల్వ,చెల్లించిన ప్రీమియంల మొత్తం,ఋణం వివరాలు,అంత్యనిల్వ ఉద్యోగి కార్యాలయం వారు తెలియచేస్తారు.నిర్ణీత స్లాబు రేటు కంటే ఒకేసారి జీతంలో 20% వరకు ప్రీమియంను పెంచుకునే అవకాశం ఉన్నది.అయితే దీనికి వైద్యపరీక్షలు, ఇన్సూరెన్స్ డైరెక్టర్ అనుమతి అవసరం.(GO.MS.No-36,Finance, Date:22.2.95) Insurance చేసిన వ్యక్తి జీతంమీద సెలవులో ఉన్నపుడు ఆ జీతభత్యం డ్రా చేసేటప్పుడు ఈ ప్రీమియం వసూళ్లు చేయబడును.ఒక ఉద్యోగి జీత నష్టం సెలవు లేదా suspension లో ఉన్నపుడు అతని ప్రీమియం చెల్లించకపోతే ఆ ప్రీమియం మొత్తం ఆ పాలసీ మీద అప్పుగా భవించబడి,ఆ అప్పులపై సం.కు 4% చక్రవడ్డి చొప్పున లెక్కించి అతని భవిష్యత్ జీతం ఏరియాల్ నుండి వాయిదాలలో రికవరీ చేయబడును.Rule 36 APGLI, GO.MS.No-138,Fin. Date:10.9.97,. G.O.R.T.1604.Fin.plg. Date.5.12.78. మేరకు పాలసీ హోల్డర్ ఆఫడవిట్ మేరకు మిస్సింగ్ క్రెడిట్స్ ను డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్జెస్ట్ చేయాలి.


ఉద్యోగులు చెల్లించవలసినప్రీమియం వివరాలు:
Pay Slab monthly                                                          ప్రీమియం
6700-8440                                                                      250.00

Academic Calendar 2025-26 Primary | High School Andhra Pradesh

8441-10900                                                                    350.00
10901-14860                                                                 450.00
14861-18030                                                                 600.00
18031-25600                                                                 750.00
Above 25601                                                                  1000.00
(G.O.M.S No-231, Finance. Date: 28-06-2010.)

నామినేషన్ సౌకర్యం:
పాలసీ మొత్తానికి నామినేషన్ సౌకర్యం కలదు. పాలసీదారు భార్య, పిల్లలకు తప్పక నామినేషన్ ఇవ్వాలి. వీరితోపాటు తమ రక్తసంబందీకులకు, వివాహ సంబంధికులకు నామిని ప్రకటించవచ్చు. దరఖాస్తు ఫారంతో పాటు నామిని పేర్లు, వయసు, నామినీల తండ్రి పేరు పేర్కొనాలి.(APGLI Rule-31)

కాలపరిమితి:
ఉద్యోగి పదవీ విరమణ తేదీ నాటికి ఈ పాలసీ meturity ని పరిమితం చేస్తారు. Voluntary Retairment, Medical in Validation లేక ఏ ఇతర కారణాల వలన అయిన ఉద్యోగం మానుకుంటే meture తేదీ వరకు పాలసీదారు విడిగా నెలవారీ/క్వార్టర్/అర్ధ సంవత్సరం/వార్షిక చందా రూపంలో చెల్లించవచ్చు. లేదా ఉద్యోగం మానిన తేదీ నాటికి Surrender విలువను గాని పాలసీ యొక్క ప్రస్తుత విలువను గాని, ఆనాటి కి చెల్లించి పాలసీ మొత్తం విలువను పొందవచ్చు.

రుణ సౌకర్యం:
పాలసీ రుణం కోసం దరఖాస్తు చేయు నాటికి పాలసీ విలువపై/ surrender విలువపై గాని 90% ఏది ఎక్కువ అయితే అది ఆ మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. ఈ రుణాన్ని 12 వాయిదాలకు తగ్గకుండా 48 వాయిదాలకు మించకుండా తిరిగి చెల్లించాలి వడ్డీ అనేది ప్రభుత్వం ప్రీమియం మొత్తంకి చెల్లించే వడ్డీ కంటే 1% వడ్డీ అధికంగా వసూలు చేస్తుంది. APGLI లోన్ EMI ను పే షెడ్యూల్ లో విడిగా చూపాలి.


క్లెయిమ్ పొందే విధానం:
Claim for Death ను ఇన్సూరెన్స్ డైరెక్టర్ సెటిల్ చేస్తారు. దీనికై:
1) రిఫండ్ ఫారం నం.02 ను పూర్తి చేయాలి, పేరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారి దృవీకరించాలి.
2) స్టాంప్ అంటించిన అడ్వాన్స్ రసీదు.
3) ఒరిజినల్ పాలసీ బాండ్.
4) లీగల్ హెల్త్ సెర్టిఫికెట్.
5) మరణ ధ్రువీకరణ పత్రం.
6) మేజర్లయిన అవివాహిత మరియు వితంతు కుమార్తెల నుండి withdrawal certificate సమర్పించాలి. నామిని ప్రకటించి ఉన్న యెడల క్లెయిముల ద్వారా సెటిల్ చేయాలి.
7) మెచ్యూరిరీ క్లెయిమ్ ఇతర క్లెయిమ్ లకు గెజిటెడ్ అధికారిచే దృవీకరించిన రిఫండ్ ఫారం నం.01 సమర్పించాలి.
8) పాలసీ తేదీ నుండి క్లెయిమ్ తేదీ వరకు పనిచేసిన స్థలాల వివరాలు సమర్పించాలి.

పాలసీ బెనిఫిట్స్:
పాలసీ విలువపై ప్రభుత్వం ప్రకటించే రేటు మేరకు బోనస్, టెర్మినల్ బోనస్, లభిస్తుంది. ఈ పాలసీ ప్రీమియం మొత్తాలకు ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తారు. 21 సం.ల వయసు గల పాలసీదారు కట్టే 1రూ.లు ప్రీమియం పదవి విరమణ తరువాత తేదీ నాటికి రూ. 453.60 మొతంగా లభిస్తుంది.
G.O.M.S No.29 Finance, Date: 31-01-2009 ద్వారా కామన్ ప్రపోసల్ ఫారమ్ లు ఇవ్వబడ్డాయి.

బోనస్ వివరాలు: (ప్రతి 1000 రూ.లకు)
1978-1981…………….40.00
1981-1984…………….56.00
1984-1987…………….66.00
1987-1990…………….80.00
1990-1993…………….100.00
1993-1996…………….105.00
1996-1999…………….100.00
1999-2002…………….100.00
2002-2010…………….110.00

Update Your Aadhar Before June 14 2025 | Aadhar Upadate with Free of Cost

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment