
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదారులు తమ వ్యక్తిగత వివరాల్లో AP Employees & Pensioners Master Data Correction మార్పులు (పేరు, జననతేది, DOJ, ఆధార్, మొబైల్ నంబర్, GPF, APGLI నంబర్ మొదలైనవి) చేయించుకోవాలనుకుంటే, సంబంధిత DDO/ట్రెజరీ ఆఫీస్ ద్వారా Treasuries and Accounts Department కి అధికారికంగా దరఖాస్తు పంపాలి.
AP Employees & Pensioners Master Data Correction దరఖాస్తు ఎక్కడికి పంపాలి?
అన్ని మార్పుల కోసం పత్రాలు జత చేసి క్రింది చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి:
To
The Director,
Treasuries and Accounts Department,
First Floor, Nidhi Bhavan,
Mangalagiri.
📌 గమనిక: DDO Covering Letter లో తప్పనిసరిగా Employee CFMS ID, DDO Code, Office Official Email ID & DDO Contact Number నమోదు చేయాలి. వీటిలో కొన్ని సవరణలు మీ NIDHI login లో మార్పులు చేసుకోవచు.
పేరు (Name) సవరణకు అవసరమైన పత్రాలు
- SR కాపీ (Xerox)
- SSC మార్క్స్ మెమో కాపీ
- ఆధార్ కార్డు కాపీ
- గజిట్ కాపీ (పూర్తి పేరు మార్పు ఉంటే మాత్రమే)
- అన్ని పత్రాల్లో ఒకే పేరు ఉండాలి.
DOJ (Date of Joining) సవరణకు పత్రాలు
- SR కాపీ Xerox (1st page & DOJ entry page – ఉద్యోగి పేరు తప్పనిసరిగా ఉండాలి)
- జాయినింగ్ లెటర్ కాపీ
- జాయినింగ్ రిపోర్ట్ కాపీ (కొత్త నియామకులకే వర్తిస్తుంది)
ఆధార్ నంబర్ సవరణకు
- ఆధార్ కాపీ
- DDO లెటర్
మొబైల్ నంబర్ సవరణకు
- వ్యక్తిగత Representation
- మార్పు కారణాలు తెలిపిన DDO లెటర్
GPF & APGLI నంబర్ అప్‌డేట్‌కు
- GPF Authorization / APGLI బాండ్
- DDO లెటర్
- Treasury Officer ద్వారా మాత్రమే Representation పంపాలి.
పింఛనుదారుల వివరాల సవరణ (పేరు / DOB / మొబైల్ నంబర్)
- PPO Authorization కాపీ
- వ్యక్తిగత Representation
- Treasury Officer ద్వారా మాత్రమే DTA కి పంపాలి.
DDO Current Account నంబర్ అప్‌డేట్‌కు
- DDO లెటర్ (బ్యాంక్ అకౌంట్ మార్చడానికి కారణాలు)
- పాత DDO కరెంట్ అకౌంట్ నుండి Zero Balance NOC సర్టిఫికేట్
- కొత్త బ్యాంక్ పాస్ బుక్ / Cancelled Cheque కాపీ
ఉద్యోగులు మరియు పింఛనుదారులు తమ వ్యక్తిగత వివరాల సవరణ కోసం పై సూచనలు పాటించి, అవసరమైన పత్రాలను సక్రమంగా జతచేస్తే, Treasuries and Accounts Department ద్వారా మార్పులు సులభంగా జరుగుతాయి.